లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి మరో ట్రయిలర్

Friday,March 08,2019 - 12:00 by Z_CLU

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఓ ట్రయిలర్ వచ్చింది. అది సంచలనం కూడా సృష్టించింది. ఇప్పుడీ సినిమా నుంచి మరో ట్రయిలర్ విడుదల చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మలిదశలో ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశానంటున్న వర్మ.. ఈసారి ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు పాత్రల్ని మరింత బలంగా ట్రయిలర్ లో ప్రజెంట్ చేశాడు.

రెండోసారి ఎన్టీఆర్ ఎలా ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు.. అప్పటి అనిశ్చితి పరిస్థితుల్లో చంద్రబాబు ఎలా వ్యవహరించారు.. ఈ మొత్తం ఎపిసోడ్ లో లక్ష్మీపార్వతి పాత్ర ఎంత అనే కోణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందనే విషయాన్ని ట్రయిలర్-2 చెప్పకనే చెబుతోంది.

వాడూ, నా పిల్లలు కలిసి నన్ను చంపేశారంటూ గతంలో ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో ప్రారంభమైన ఈ 2 నిమిషాల 30 నిమిషాల ట్రయిలర్ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఎలివేట్ చేసింది. ఎన్టీఆర్ గా పి.విజయ్ కుమార్, లక్ష్మీపార్వతిగా యజ్ఞ షెట్టి, చంద్రబాబు నాయుడిగా శ్రీతేజ్ నటించిన ఈ సినిమాను ఆర్జీవీ, అగస్త్య కలిసి డైరక్ట్ చేశారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ సినిమాను ఈనెలలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.