నవంబర్ 20 నుంచి వర్మ-నాగార్జున సినిమా

Thursday,November 02,2017 - 10:53 by Z_CLU

తెలుగు సినిమా కాన్వాస్ పై రాంగోపాల్ వర్మ-నాగార్జునల “శివ” సినిమా ఒక చెరగని సంతకం చేసింది. “శివ” విడుదలై 28 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా కొత్త దర్శకులకు ఒక నిఘంటువు వంటిది. అలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్లకు రిపీట్ కానుంది.

రాంగోపాల్ వర్మ స్వయంగా నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. “శివ” సినిమా మొదటి షాట్ ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. వర్మకు చెందిన “కంపెనీ” బ్యానర్ లో ఈ క్రేజీ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు.

ఆర్జీవి చిరకాల మిత్రుడు సుధీర్ చంద్ర ఈ చిత్రానికి ప్రజెంటర్. ఏప్రిల్ నాటికి షూటింగ్ పూర్తిచేయాలనేది టార్గెట్. ఈ అమేజింగ్ మూవీ రిలీజ్ డేట్, టైటిల్ మరియు ఇతర క్యాస్ట్ & క్రూ డీటెయిల్స్ ను త్వరలోనే వర్మ ప్రకటిస్తాడు.