శ్రీను వైట్ల

Tuesday,November 29,2016 - 04:21 by Z_CLU

శ్రీను వైట్ల ప్రముఖ దర్శకుడు. సెప్టెంబర్ 24 , 1972  లో కందులపాలెం (ఈస్ట్ గోదావరి) లో జన్మించారు.  రవి తేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘నీ కోసం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత ఆకాష్ కథానాయకుడిగా ‘ఆనందం’ సినిమాను తెరకెక్కించిన శ్రీను వైట్ల ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి విజయంఅందుకున్నారు.ఈసినిమాతరువాత’సొంతం’,’ఆనంద మానం దమాయే’,’వెంకీ’,’అందరి వాడు’,’ఢీ’,’దుబాయ్ శీను’,’రెడీ’,’కింగ్’,’నమో వెంకటేశాయ’,’దూకుడు’,’బాద్షా’,’ఆగడు’,’బ్రూస్ లీ’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ‘ఆనందం’, ‘వెంకీ’,’ఢీ’,’దుబాయ్ శీను’,’రెడీ’,’బాడ్ షా’ వంటి సినిమాలతో దర్శకుడిగా విజయాలు అందుకున్న శ్రీను వైట్ల ‘దూకుడు’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ‘మిస్టర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు