RGV నాగ్ సినిమా టైటిల్ ఇదేనా...?

Monday,January 22,2018 - 12:13 by Z_CLU

ప్రస్తుతానికి సెట్స్ పై ఉన్న RGV, నాగ్ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. నాగ్ ఫ్యాన్స్ ని మరీ  సస్పెన్స్ లో ఉంచని రాం గోపాల్ వర్మ, సినిమా లాంచ్ రోజే నాగ్ లుక్స్ ని రివీల్ చేసి, సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేశాడు. అయితే సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్ ‘శపథం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారనే టైటిల్ ఇప్పుడు టాలీవుడ్ లో హీట్ ని జెనెరేట్ చేస్తుంది.

అల్టిమేట్ రివేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి నిన్నా మొన్నటి వరకు ‘సిస్టమ్’ అనే పేరు వినిపించినా, ఇప్పుడు కొత్తగా ‘శపథం’ అనే టైటిల్ తో పాటు ‘రివేంజ్ కంప్లీట్స్’ అనే ట్యాగ్ లైన్ పెట్టనున్నారనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

టాలీవుడ్ లో ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ టైటిల్ ఎంతవరకు కన్ఫం అనేది అఫీషియల్ గా అనౌన్స్ అయితే కానీ క్లారిటీ రాదు. నాగార్జున సరసన అమైరా శరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని R కంపెనీ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్నాడు.