నాగార్జున ఆఫీసర్ : టీజర్ రివ్యూ

Monday,April 09,2018 - 12:33 by Z_CLU

మే 25 న రిలీజవుతుంది RGV డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆఫీసర్. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజయింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ ‘ఆఫీసర్’ కి ‘Cops Were Never This Scary’ అని ట్యాగ్ లైన్  గా పెట్టుకున్న RGV, కాప్స్ నే కాదు నాగార్జునను కూడా డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేశాడు. SIT ఆఫీసర్ గా ఈ సినిమాలో నాగ్ విశ్వరూపం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

నారాయణ పసారి మర్డర్ ఇన్వెస్టిగేషన్ ‘ఆఫీసర్’ మెయిన్ స్టోరీ. 1:06 నిమిషాల ఈ టీజర్ లో ఇమోషనల్ పాయింట్స్ ఎలివేట్ కాకపోయినా, సినిమాలో ఇమోషనల్ యాంగిల్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అల్టిమేట్ గా హైదరాబాద్ నుండి ఒక స్పెషల్ కేస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన ఆఫీసర్ తన టార్గెట్ ని ఎలా రీచ్ అయ్యాడు అనేది థియేటర్ లో చూడాల్సిందే.  

మైరా షరీన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని RGV స్వయంగా నిర్మిస్తున్నాడు. నాగ్ RGV కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.