మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పిన వర్మ

Sunday,January 08,2017 - 11:00 by Z_CLU

ఖైదీ నంబర్ 150 ప్రీ-రిలీజ్ సాక్షిగా రామ్ గోపాల్ వర్మపై మెగా కాంపౌండ్ ఫైర్ అయింది. ఇన్నాళ్లూ వర్మ చేసిన కామెంట్స్, పోస్ట్ చేసిన ట్వీట్స్ చూసి చూసీచూడనట్టు ఊరుకున్న మెగా హీరోలు, ఈసారి మాత్రం అలా ఊరుకోలేదు. తమ ఆవేశాన్నంతా ప్రీ-రిలీజ్  ఫంక్షన్ సాక్షిగా బయటపెట్టారు. మరీ ముఖ్యంగా మెగా హీరో నాగబాబు అయితే వర్మపై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. దీంతో వర్మ వెనక్కి తగ్గారు. ట్విట్టర్ సాక్షింగా మెగా కాంపౌండ్ కు క్షమాపణలు చెప్పారు. అంతా తనను క్షమించాలని వేడుకున్నాడు.

తను ఎవర్నీ టార్గెట్ చేయనని… చిరంజీవి నుంచి ఎంతోమందిపై విమర్శలు చేస్తుంటానని.. ఒక్కోసారి తనపై తానే కామెంట్స్ కూడా చేసుకుంటానని తెలిపిన వర్మ.. తన ట్వీట్లు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలని కోరాడు. మరీ ముఖ్యంగా మెగా హీరోలు తనను క్షమించాలని వేడుకున్నాడు. ఈ సందర్భంగా మెగా కాంపౌండ్ ను ఉద్దేశించి చాలా ట్వీట్స్ చేశాడు వర్మ.