నాగ్ RGV సినిమాలో హీరోయిన్ ఫిక్సయింది..?

Friday,November 24,2017 - 05:03 by Z_CLU

నాగార్జున RGV కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. నాగ్ కరియర్ లో గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా యూనిక్ గా ఉండబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు దానికి తోడు ఈ సినిమాలో నాగ్ సరసన అనుష్క జోడీ కట్టనుందనే టాక్ సోషల్ మీడియాలోనే కాదు టాలీవుడ్ లోను ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది.

‘సూపర్’ మూవీ నుండి బిగిన్ అయితే ‘ఓం  నమో  వెంకటేశాయ’ వరకు స్క్రీన్ పై వీళ్ళిద్దరి కాంబినేషన్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అలాంటిది టాలీవుడ్ అప్ కమింగ్ సినిమాల్లో స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగ్ సరసన అనుష్క జోడీ కడితే, సినిమాలో డెఫ్ఫినేట్ గా మరో ఎట్రాక్టివ్ ఎలిమెంట్ యాడ్ అయినట్టే అవుతుంది.

 

ఈ విషయంలో సినిమా యూనిట్ నుండి ఎటువంటి అప్ డేట్స్ అయితే లేవు కానీ, ఫ్యాన్స్ కి మాత్రం ఈ అన్ అఫీషియల్ న్యూస్, నిజమైతే బావుందనే ఫీలింగ్ స్ట్రాంగ్ గా ఉంది. మరి RGV & టీమ్ మైండ్ లో ఏం నడుస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకి RGV ప్రొడ్యూసర్.