రామ్ గోపాల్ వర్మ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Thursday,December 22,2016 - 06:24 by Z_CLU

సంచలనాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ అనే మరో సెన్సేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయవాడ రౌడీయిజంపై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు థియేటర్స్ కు రానుంది. ఈ సందర్బంగా ఆర్జీవీతో జీ-సినిమాలు ఎక్స్ క్లూజివ్..

 

*అందుకే ఇదే చివరి సినిమా అని అనౌన్స్ చేశా

‘వంగవీటి’ తర్వాత తెలుగులో మరో సినిమా చేయనని అనౌన్స్ చేసా. దర్శకుడిగా నాలో ఆసక్తి కలిగించే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ, క్యారెక్టర్స్ మళ్ళీ నాకు దొరకవని నా ఫీలింగ్. అందుకే ఇదే లాస్ట్ సినిమా అని ఫిక్స్ అయిపోయా. ఈ సినిమా చూసాక నేను ఎందుకలా ఫీలయ్యానో మీకే తెలుస్తుంది.

 

*అప్పుడే ఫిక్స్ అయిపోయా

పూరి ఆఫీస్ లో ఓ పార్టీలో సాండీ ని చూసాను. చూడగానే రాధ క్యారెక్టర్ కి బాగుంటాడేమో అనిపించి నా దగ్గర ఉన్న రాధా ఫోటో ఒకటిచ్చి ఈ లుక్ లో ఫోటోలు పంపించమని చెప్పా. ఆ నైట్ ఫొటోస్ పంపించాడు. ఫొటోస్ చూడగానే రాధా క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యా. ఆ తర్వాత రంగ ఫోటో ఇచ్చి ఈ లుక్ లో కూడా ఫొటోస్ దిగి పంపించమని చెప్పా. ఆ ఫోటో లు చూసి రంగ క్యారెక్టర్ కి కూడా సాండీ నే ఫిక్స్ చేశా. రెండు క్యారెక్టర్స్ లో నేను అనుకున్నదాని కంటే ఇంకా బెటర్ గా పెర్ఫార్మ్ చేశాడు.

 

siv_7449

 

*వాళ్ళని కలిసింది కేవలం అందుకే

ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు విజయవాడ వెళ్లి కొందరిని కలిశా. కానీ వాళ్ళను కలిసింది రీసెర్చ్ గురించి పెద్దగా కాదు గాని రీసెర్చ్ కంటే ఆ సంఘటనలు చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవడానికే కలిసి మాట్లాడా. అసలు ఈ కథ గురించి అందరికంటే నాకే బాగా తెలుసని నా నమ్మకం. నేను విజయవాడలో చదువుతున్నప్పుడే ఆ సంఘటనలు కొన్ని చూశా. వాటి గురించి డీటెయిల్డ్ గా అప్పుడే తెలుసుకున్నా. సినిమా స్టార్టింగ్ లో పెద్దగా రీసెర్చ్ ఏం చేయలేదనే చెప్పాలి.

*రక్తచరిత్ర తో పోలిస్తే…

రక్తచరిత్రతో పోలిస్తే ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. హీరో-విలన్ మధ్య జరిగే యాక్షన్ కమర్షియల్ సినిమా ‘రక్తచరిత్ర’. ఆ సినిమా కంటే ‘వంగవీటి’ చాలా రెట్లు రియాలిటీగా, ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది.

 

siv_7482

* నా ఇష్టమొచ్చినప్పుడు తీస్తా

వరుసగా సినిమాలు అనౌన్స్ చేశా. కానీ అవి ఎప్ప్పుడు తీస్తానో నాకే తెలియదు. ఆ టైంలో ఏ సినిమా తీయాలనిపిస్తే అది తీసేస్తా. అంతే కానీ అనౌన్స్ చేసినవన్నీ తీయాలన్న ఉద్దేశ్యం అయితే అస్సలు లేదు.

 

*అది మాత్రం సస్పెన్స్

ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఉందా? లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్. ఆ విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇంకొన్ని గంటల్లో ఆ క్యారెక్టర్ ఉందా? లేదా అనేది మీకే క్లారిటీ వస్తుంది.

 

siv_7512

* నా ఒపీనియన్ నా ఇష్టం

ఈ సంక్రాంతికి వార్ వన్ సైడ్ అని ట్వీట్ చేశా. దానిపై మెగా ఫ్యాన్స్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అవన్నీ అస్సలు పట్టించుకోను. ‘శాతకర్ణి’ ట్రైలర్ చూడగానే నాకు అనిపించిన ఒపీనియన్ ట్వీట్ చేశా.

 

*నా దృష్టిలో పవన్…

పవన్ కళ్యాణ్ కి నేను ఓ అభిమానిని. అందుకే ఆయనకు నా ట్వీట్స్ తో సలహాలు ఇస్తుంటా. నా దృష్టిలో పవన్ నిద్ర పోతున్న ఓ అగ్ని పర్వతం. అగ్నిపర్వతం టైం వచ్చినప్పుడు పేలుతుంది. పవన్ కూడా అంతే. ఈ ఎలక్షన్స్ కు పవన్ పేల్చేస్తాడని నా నమ్మకం.

siv_7392

*శివ సీక్వెల్ ఉండదు

ఒకవేళ ‘శివ’ కి సీక్వెల్ తీయాల్సి వస్తే ఆ కథ స్టూడెంట్స్ మధ్య గొడవలు ఈ జనెరేషన్ లో వర్కౌట్ కాదని నా ఒపీనియన్. ఆ కథ కు సీక్వెల్ తీయలేను. మళ్ళీ సీక్వెల్ చేసి ఆ సినిమా వాల్యూ కూడా తగ్గించలేను.

 

*నాగార్జున, అమితాబ్ తో మల్టీస్టారర్…

నేను డైరెక్టర్ గా సక్సెస్ అవ్వడానికి కారణం అయిన నాగార్జున-అమితాబ్ తో ఓ సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో యాక్షన్ సీన్స్ లో చూడాలని నా కోరిక. కుదిరితే వాళ్ళిద్దరితో యాక్షన్ సినిమా చేస్తా…

*ప్రెజెంట్ ఆ ఆలోచన లేదు

అక్కినేని నాగ చైతన్య, అఖిల్ తో సినిమాలు చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. ఫ్యూచర్ లో చెప్పలేను.