నా సినిమాకు పేరు పెట్టలేదు-నాగార్జున

Friday,December 08,2017 - 11:01 by Z_CLU

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాగార్జున. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. దీంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు కాస్త పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే గాసిప్స్ కూడా ఎక్కువైపోయాయి. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని కొందరు పుకార్లు పుట్టించారు. “సిస్టమ్” అనే టైటిల్ పెట్టారంటూ వార్తలు కూడా వండేశారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చాడు నాగార్జున.

తన సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని ప్రకటించిన నాగార్జున మూవీ అప్ డేట్స్ ను మీడియాతో పంచుకున్నాడు. “వర్మతో సినిమా చాలా బాగా వస్తోంది.. వెరీ హ్యాపీ.. కొత్త షెడ్యూల్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ లో రిలీజ్ చేస్తాం. టైటిల్ ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు.” తన కొత్త సినిమాపై నాగ్ రియాక్షన్ ఇది.

ప్రస్తుతం ఈహీరో హలో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కోసం అమెరికా కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాతే నాగ్‍‍‍‍, వర్మ సినిమా మళ్లీ పట్టాలపైకి వస్తుంది.