ఆ సినిమా కోసం అమితాబ్, నాగార్జున....

Friday,December 09,2016 - 05:00 by Z_CLU

అమితాబ్ బచ్చన్, నాగార్జున ఒకే వేదికపై గెస్ట్ లుగా మెరవబోతున్నారు. అయితే ఇదేదో బిజినెస్ కి సంబంధించి ఈవెంట్ అనుకుంటే పొరపాటే. వీళ్లిద్దరు ఎటెండ్ అయ్యేది ఓ సినిమా ఫంక్షన్ కి. ఆ సినిమా మరేదో కాదు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వంగవీటి’.

లేటెస్ట్ గా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను విజయవాడ నిర్వహించిన యూనిట్ హైదరాబాద్ లో మరో భారీ ఈవెంట్ ప్లాం చేస్తున్నారట. ఈ నెల 23 న సినిమా రిలీజ్ కానున్న సందర్బంగా 20 న హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారట. ఈ వేడుకకకు బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి తో పాటు కింగ్ నాగార్జున కూడా చీఫ్  గెస్ట్ లుగా హాజరు కానున్నారట. ఇక వీరిద్దరికీ రామ్ గోపాల్ వర్మకు మధ్య రిలేషన్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందుకే ఈ ఈవెంట్ హాజరయ్యేందుకు అడిగిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.