నాగార్జున ‘ఆఫీసర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్

Saturday,May 26,2018 - 11:02 by Z_CLU

ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసింది నాగార్జున ‘ఆఫీసర్’ టీమ్. జూన్ 1 న గ్రాండ్ గా రిలీజవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 28 న N కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరగనుంది. అయితే ఈ ఈవెంట్ లో సుకుమార్ చీఫ్ గెస్ట్ గా రానున్నాడు.

RGV డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా స్టోరీ కర్నాటక ACP  ప్రసన్న కుమార్ కరియర్ లోని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిందని రివీల్ చేయడంతో యాక్షన్ మూవీ లవర్స్ లో న్యాచురల్ గానే ఈ సినిమాపై క్యూరాసిటీ జెనెరేట్ అవుతుంది.

ఈ సినిమాలో నాగ్ సరసన మైరా షరీన్ హీరోయిన్ నటిస్తుంది. RGV మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్వయంగా నిర్మించాడు.