వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్

Tuesday,July 04,2017 - 11:27 by Z_CLU

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా పక్కా అయింది. అది కూడా నటసార్వభౌముడు నందమూరి ఎన్టీఆర్ బయోపిక్ కావడం విశేషం. అవును.. తండ్రి జీవిత చరిత్రలో నటించాలనే కోరికను ఇన్నాళ్లకు నెరవేర్చుకోబోతున్నారు నటసింహం.

తన 101వ సినిమాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేస్తున్నాడు బాలయ్య. 102వ మూవీగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వర్మతో చేయబోయే సినిమా బాలయ్యకు 103వ చిత్రం అవుతుంది. వీళ్లిద్దరి కాంబోలో ఇదే మొదటి సినిమా.


తెలుగుతెరపై తిరుగులేని నటుడిగా ఎదిగిన ఎన్టీఆర్.. ఆ స్థాయికి ఎలా చేరుకున్నారు.. ఎలాంటి పరిస్థితుల మధ్య రాజకీయాల్లోకి వచ్చారు.. ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ముఖ్యమంత్రిగా ఎదిగారనే అంశాల్ని ఈ బయోపిక్ లో ప్రధానంగా చూపించబోతున్నారు. గతంలో వంగవీటి, పరిటాల జీవిత చరిత్రలను సినిమాలుగా తెరకెక్కించిన అనుభవం వర్మకు ఉంది.