RGV ఇంటర్వ్యూ

Wednesday,November 27,2019 - 03:52 by Z_CLU

సెన్సేషనల్ డైరెక్టర్ RGV తన అప్ కమింగ్ సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. సెటైరికల్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా చేయడానికి ఇన్స్ పైర్ చేసిన సందర్భాల గురించి డీటేల్డ్ గా మాట్లాడాడు. అవి మీకోసం…

చాలా కామన్ అయిపోయింది

నా సినిమా రిలీజ్ టైమ్ లో కోర్టు చుట్టూ తిరగడం అనేది సూర్యుడు తూర్పున ఉదయించడం అంత కామన్ అయిపోయింది. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

రియల్ ఇన్సిడెంట్స్ తో పాటు…

మే 2019 నుండి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. కథ సెప్టెంబర్ 2020 టైమ్ వరకు నడుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన కథ ఆధారంగా దాని ఫ్యూచర్ ఊహించి తెరకెక్కించడం జరిగింది.

సెటైరికల్ వ్యూ లో…

ఈ సినిమాకి ప్రత్యేకంగా కామెడీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. K.A. పాల్ లాంటి వ్యక్తి ఇన్సిడెంట్స్ స్క్రీన్ పైకి వచ్చినప్పుడు న్యాచురల్ గానే కామెడీ వచ్చేస్తుంది. ఆయనదేమీ సీరియస్ క్యారెక్టర్ కాదు కాబట్టి… కాకపోతే ఈ సినిమాలో కాస్త సెటైరికల్ గా ప్రెజెంట్ చేయడం జరిగింది.

ఇలా ఎప్పుడూ జరగలేదు…

కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని, దానికి రిలేటెడ్ రియల్ క్యారెక్టర్స్ ని పోలే నటులతో సినిమా చేయడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్. ఇలా ఎప్పుడూ జరగలేదు.

నేను అలా చేయలేదు…

విజయవాడలో ఎలక్షన్స్ జరిగిన తరవాత ఒక వర్గం వాళ్ళు ఉన్న ప్లేస్ లో ఇంకో వర్గం వాళ్ళు వచ్చారు అనేది నాకు ఇన్స్ పిరేషన్ పాయింట్. అంతే కానీ కావాలని ఒక వర్గం వాళ్ళను ఇంకొకరు కించపరచడం లాంటి ఇన్సిడెంట్స్ ఈ సినిమాలో ఉండవు. అది నా ఉద్దేశం కూడా కాదు.

నేనెవర్నీ కించపరచలేదు…

రీసెంట్ గా రిలీజైన సాంగ్ కూడా నేనేదో కొత్తగా క్రియేట్ చేసింది కాదు. బయట మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఉన్నవే. నేనే పాయింట్ తీసుకున్నా అవి ఆల్రెడీ ఉన్నవే. ఏది నేను పర్టికులర్ గా క్రియేట్ చేసింది కాదు.

వాళ్ళకే అంకితం…

ఈ సినిమాని ప్రముఖ ప్రఖ్యాతి గాంచిన తండ్రీ కొడుకులకు అంకితమిస్తున్నా.. వాళ్ళెవరు..? వాళ్ళ పేర్లు ఏంటనేది మాత్రం నేను చెప్పను…

వెబ్ సిరీస్ కి దీనికి…

నేను ఫ్యూచర్ లో చేయాలనుకుంటున్న వెబ్ సిరీస్ కి, ఈ సినిమాకి ఏ సంబంధం ఉండదు. అది కంప్లీట్ గా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.

K.A. పాల్ గురించి…

అయన ఆ మధ్య సాంగ్ గురించి రియాక్ట్ అయి ఉంటారేమో కానీ, ప్రస్తుతం ఆయన ప్రపంచ శాంతి చర్చల్లో బిజీగా ఉంటారు.. ఆయనకివన్నీ పట్టించుకునే టైమ్ ఉందని నేను అనుకోవట్లేదు.

అది నా సహనం కాదు…

నన్ను నేను తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు. నాకలాంటి బుద్ధి అలవాటైపోయింది. కాబట్టి నా చుట్టూరా ఉండే నెగెటివిటీ వల్ల నాకేం ప్రాబ్లమ్ ఉండదు.

నాసిక్ నుండి వచ్చాడు…

రియల్ ఇన్సిడెంట్స్.. రియల్ క్యారెక్టర్స్ తో సినిమా కాబట్టి కంపల్సరీగా వాళ్ళ పోలికలతో ఉన్నవాళ్ళే కావాల్సి వచ్చింది. అందుకే గత ముఖ్యమంత్రి క్యారెక్టర్ లో నటించిన వ్యక్తిని నాసిక్ నుండి పిలిపించడం జరిగింది. ఓ నెల రోజుల పాటు ఇక్కడే ఉంచి యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం…

నో సెన్సార్ ప్రాబ్లమ్…

నేను సినిమాలో ఎక్కడా.. ఈ కులం ఎక్కువ, ఈ కులం తక్కువ అని మెన్షన్ చేయలేదు కాబట్టి సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పే అవకాశం ఎక్కడా లేదు.

ఆ అవకాశం కూడా ఉంది…

పొలిటికల్ ఇన్సిడెంట్స్ అనేవి రోజూ జరుగుతూనే ఉంటాయి కాబట్టి… ఆ బ్యాక్ డ్రాప్ లో కంటిన్యూస్ గా సిరీస్ చేయవచ్చు…

సినిమా వాళ్లకు నచ్చింది…

ఈ సినిమా తెలుగు దేశం పార్టీ వాళ్లకు చాలా నచ్చింది. ముఖ్యంగా పప్పు సీన్… వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ అంతర్గత భావాలు నేను అలా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసినందుకు వాళ్లకు నచ్చినట్టుంది.

అలాంటి కాల్స్ చేయరు…  

ఈ సినిమాకి సంబంధించి నాకు ఎటువంటి బెదిరిపు కాల్స్ రాలేదు ఎందుకంటే కాల్స్ రికార్డ్ చేస్తారని భయం. ఇకపోతే నా దగ్గరికి స్ట్రేట్ గా వచ్చి బెదిరించే ధైర్యం కూడా ఎవరికీ లేదు. కాబట్టి అది కూడా జరగలేదు…

జరగబోతుంది చూస్తారు…

ఈ సినిమాలో కొన్ని ఇన్సిడెంట్స్ ఆల్రెడీ జనం అసెంబ్లీలో చూసేశారు. కానీ ఈ సినిమాలో ఫ్యూచర్ లో ఏం జరగబోతుందన్నది కూడా చూస్తారు.

సినిమాలో ‘మనసేన’ పార్టీ…

సినిమాలో మనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కి ఎటువంటి సంబంధం ఉండదు. కేవలం పవన్ కళ్యాణ్ ని పోలిన వ్యక్తి సినిమాలో ‘మనసేన’ అనే పార్టీని పెడతాడు అంతే.

డైరెక్టర్స్ రావట్లేదు…

నా కాంపౌండ్ నుండి వచ్చే సినిమాల డైరెక్టర్స్ కంటే నాక్కొంచెం ఎక్కువ పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను  ముందుండి సినిమాని ప్రమోట్ చేస్తున్నాను అంతే కానీ, వాళ్ళు మీడియా ముందుకు రాకూడదు లాంటి కండిషన్స్ లేవు.. అది వాళ్ళ ఇష్టం అంతే…

ఈ సినిమా ఎందుకు చూడాలంటే..

ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగినపుడు రాష్ట్రాల్లో జనాలు ఎలా రియాక్టయ్యారు.. టి.వి. చానల్స్ లో ఎలాంటి ప్రసారాలు జరిగాయి. వాటి వల్ల ఏర్పడ్డ ప్రభావాలు అన్నింటినీ ఒకచోట చేర్చినట్టు ఉంటుంది ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..’.