RGV డైరక్షన్ లో సంజయ్ దత్ రియల్ బయోపిక్

Friday,July 20,2018 - 04:48 by Z_CLU

రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో తెరకెక్కిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ బాలీవుడ్ రికార్డ్స్ ని తిరగరాస్తుంది. సంజయ్ దత్ లైఫ్ లోని రియల్ ఇన్సిడెంట్స్ ని కళ్ళకు కట్టినట్టు తెరకెక్కిన ఈ సినిమా, ఫ్యాన్స్ కి తెలియని మరెన్నో విషయాలను రివీల్ చేసింది. అయితే ఈ సినిమా పట్ల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒపీనియన్ ఇంకోలా ఉంది.

సంజయ్ దత్ లైఫ్ లో 1993లో జరిగిన బాంబుదాడి, AK-56 రైఫిల్ వివాదం లాంటివి అప్పట్లో దేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఎపిసోడ్ లో సంజయ్ దత్ పడ్డ సంఘర్షణని మరింత ఎలివేట్ చేసే ఆలోచనలో ఉన్న RGV, సంజయ్ దత్ రియల్ బయోపిక్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు.

రీసెంట్ గా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన RGV సంజయ్ దత్ బయోపిక్ చేసే ఆలోచనలో ఉన్న విషయం రివీల్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ బయోపిక్ ని RGV ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొస్తాడు..? ఈ బయోపిక్ లో సంజయ్ దత్ రోల్ ప్లే చేసే స్టార్ ఎవరనే విషయాలు తెలియాల్సి ఉంది.