లక్ష్మీస్ NTR సినిమాపై వీడని సస్పెన్స్

Wednesday,October 11,2017 - 02:37 by Z_CLU

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీ’s NTR’ చుట్టూరా ఇంకా సస్పెన్స్ అలాగే కొనసాగిస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తో పాటు రోజా నటిస్తున్నారని నిన్నా, మొన్నటి వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన రూమర్స్ కి చెక్ పడుతూ ఫేస్ బుక్ లో క్లారిటీ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

 

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రోజా నటిస్తున్నారన్న వార్త పూర్తిగా అవాస్తవమని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన RGV, ఇంకా ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరగాల్సి ఉందని తేల్చేశాడు. సినిమా సెట్స్ పైకి రాకముందే తెలుగు స్టేట్స్ లో ఈ రేంజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో లీడ్ రోల్ ఎవరు ప్లే చేయనున్నారనే సస్పెన్స్ వీడాలంటే  ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకి రాకేశ్ రెడ్డి నిర్మాత. వచ్చే ఏడాది అక్టోబర్ కల్లా ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.