వర్మ సినిమాలో నాగ్ రోల్?

Thursday,November 02,2017 - 04:32 by Z_CLU

కింగ్ నాగార్జున, RGV కాంబినేషన్ లో సినిమా నవంబర్ 20 నుండి బిగిన్ కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా అప్పుడే నాగ్ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఇంతకీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఎలా ఉంటుందనే టాపిక్ నాగ్ ఫ్యాన్స్ లో ఇంటరెస్టింగ్ టాపిక్ లా మారింది.

ఇదిలాఉంటే ఈ సినిమాలో నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ లా కనిపించానున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది. ఈ విషయంలో సినిమా యూనిట్ నుండి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఈ కాంబో మాత్రం సెట్స్ పైకి రాకముందు నుండే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా కాస్ట్ & క్రూ తో పాటు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.