అల్లు అరవింద్

Wednesday,November 30,2016 - 05:46 by Z_CLU

అల్లు అరవింద్ ప్రముఖ చలన చిత్ర నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్. జనవరి 10 , 1949 లో జన్మించారు. అరవింద్ ప్రముఖ అలనాటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య తనయుడు. అల్లు అరవింద్ తనయులు అల్లు అర్జున్, శిరీష్ ప్రస్తుతం వీరిద్దరూ చలన చిత్ర పరిశ్రమ లో కథానాయకులుగా కొనసాగుతున్నారు.అల్లు అరవింద్ ప్రముఖ కథానాయకుడు మెగా స్టార్ చిరంజీవి కి బావ. తండ్రి అల్లురామలింగయ్య  సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పలు విజయ వంతమైన సినిమాలను నిర్మించారు. ‘బంట్రోతు భార్య’ చిత్రం తో నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘శుభలేఖ’,’హీరో’,’విజేత’,’పసి వాడి ప్రాణం’, ‘ఆరాధన’,’న్యాయం కోసం’, ‘రౌడీ అల్లుడు’,’పెళ్లి సందడి’,’మాస్టర్’,’అన్నయ్య’,’పెళ్ళాం ఊరెళితే’, ‘గంగోత్రి’,’జల్సా’,’మగధీర’,’100 % లవ్’,సరైనోడు’,’శ్రీరస్తు శుభమస్తు’ వంటి పలు సినిమాలను నిర్మించి ఘన విజయాలు అందుకున్నారు. అల్లు అరవింద్ నిర్మించిన చిత్రాల్లో ‘మగధీర’ భారీ కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Born : 10 january 1949

సంబంధిత వార్తలు