నాగార్జున ‘ఆఫీసర్’ వెనక రియల్ ACP ఆఫీసర్

Friday,May 18,2018 - 12:53 by Z_CLU

జూన్ 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది నాగార్జున ఆఫీసర్. అయితే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిందని కన్ఫమ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాలో ప్రస్తుతం ముంబయి సిటీ ACP గా పని చేస్తున్న K.M. ప్రసన్న కుమార్ లా కనిపించనున్నాడు నాగార్జున.

2010 లో K.M. ప్రసన్న కుమార్, RGV తో షేర్ చేసుకున్న ఒక కేస్ ఆధారంగా తెరకెక్కింది ఆఫీసర్. ముంబైలోని స్పెషల్ ఇన్వెస్టిగెటివ్ టీమ్ కి చీఫ్ గా పని చేసిన ప్రసన్న కుమార్, పోలీసాఫీసర్ గా రియల్ లైఫ్ లో ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ‘ఆఫీసర్’ సినిమాలో హైలెట్ కానున్నాయి.

 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది ‘ఆఫీసర్’. మైరా షరీన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. RGV మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తున్నాడు.