RGV కి టెస్ట్ పెట్టిన నాగార్జున

Thursday,May 31,2018 - 06:08 by Z_CLU

నాగార్జున ‘ఆఫీసర్’ రేపు రిలీజవుతుంది. హై ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ‘శివ’ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ, అసలీ సినిమా ఎలా బిగిన్ అయిందో చెప్పుకున్నాడు.

RGV నా దగ్గరికి ఈ సినిమా స్క్రిప్ట్ తీసుకుని వచ్చినప్పుడు నేను తనని నమ్మలేదు. చేంజెస్ చేయమని చెప్పి పంపించా.. కొన్నాళ్ళకు మళ్ళీ అదే కథతో వచ్చాడు. నేను కూడా మళ్ళీ అదే చెప్పి  పంపించా.. నిజానికి నేను RGV సిన్సియారిటీని టెస్ట్ చేశా…” అన్నాడు నాగార్జున.

 

నాకు RGV క్రియేటివ్ కేపబిలిటీస్ పై ఏ మాత్రం అనుమానం లేదన్న నాగార్జున, ఈ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకైనా ఈ ప్రాజెక్ట్ కి పని చేస్తాడా..? లేకపోతే మధ్యలోనే ఇంకో ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతాడోనన్న అనుమానంతో ఈ టెస్ట్ పెట్టాను అని చెప్పుకున్నాడు నాగ్.

ఈ సినిమాలో మైరా షరీన్  హీరోయిన్ గా నటించింది. RGV చాలా  కాన్ఫిడెంట్ గా, స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో తెలిసిపోతుంది.