‘ఆఫీసర్’ సినిమా చేయడానికి రీజన్ అదే: నాగార్జున

Tuesday,May 29,2018 - 01:17 by Z_CLU

జూన్ 1 న గ్రాండ్ గా రిలీజవుతుంది నాగార్జున ‘ఆఫీసర్’. రియర్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పటికే టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్,  వీడియోస్, సినిమాపై  భారీ స్థాయిలో  క్యూరియాసిటీని రేజ్ చేస్తున్నాయి. దానికి తోడు ఈ సినిమా యూనిట్ నిన్న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ సందర్భంగా నాగ్, ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ని రివీల్ చేశాడు.

“తను నమ్మకున్న నిజం కోసం పోరాడే పోలీసే ఈ ‘ఆఫీసర్’. దేనికీ భయపడకుండా ఎవరినైనా సరే ఫేస్ చేయడం, ఏదైనా త్యాగం చేయడం ఈ ఆఫీసర్ క్యారెక్టర్. రాము ఎప్పుడైతే ఈ కథ చెప్పాడో అప్పుడే నచ్చేసింది. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను” అని చెప్పుకున్న నాగ్ ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా స్టాండర్డ్స్ గురించి కూడా ఎక్స్ ప్లేన్ చేశాడు.

“శివ సినిమా తరవాత చాలామంది ఆ సినిమాలో సౌండ్ గురించి మాట్లాడారు. మళ్ళీ అంతలా ఏ సినిమా గురించి ఎవరు  మాట్లాడటం నేను వినలేదు. ‘ఆఫీసర్’ రిలీజ్ తరవాత మళ్ళీ అంతలా ఈ సినిమా గురించి మాట్లాడతారు. ‘ఆఫీసర్’ మీ గుండెల్ని తాకుతుంది. చాలా రోజుల తరవాత వస్తున్న ఒక రియల్ యాక్షన్ ఇంటెన్స్ మూవీ ఆఫీసర్” అని కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు నాగార్జున.

ఈ సినిమాలో నాగ్ సరసన మైరా షరీన్ హీరోయిన్ గా నటించింది. రవిశంకర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాను RGV, కంపనీ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించాడు.