నాగ్ ‘ఆఫీసర్’ పోస్ట్ పోన్ – రీజన్ రివీల్ చేసిన RGV

Wednesday,May 16,2018 - 01:28 by Z_CLU

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆఫీసర్’ సినిమా రిలీజ్ డేట్ మారింది. మే 25 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా జూన్ 1 న రిలీజవుతుంది. ఈ విషయాన్ని RGV ట్వీట్ చేసి కన్ఫమ్ చేశాడు. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ అనుకున్న టైమ్ కి కంప్లీట్ కాకపోవడంతో, సినిమాని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుందని మెన్షన్ చేశాడు RGV.

RGV మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు రీసెంట్ గా బాలీవుడ్ నటుడు అమితాబ్, ఈ సినిమా ట్రైలర్ ని ట్వీట్ చేయడంతో, సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఫోకస్ మళ్ళింది.

ఈ సినిమాలో నాగార్జున సరసన మైరా షరీన్ హీరోయిన్ గా నటించింది. RGV స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు నాగార్జున.