ఇది NTR లైఫ్ లోని ఒక ఘట్టం మాత్రమే...

Thursday,January 24,2019 - 02:29 by Z_CLU

‘లక్ష్మీస్ NTR’ సినిమాకి ఎలక్షన్స్ కి ఏ మాత్రం సంబంధం లేదు. NTR మహానుభావుడు. ఆయన జీవిత చరిత్ర అందరికీ తెలియాని మాత్రమే ఈ సినిమా చేస్తున్నాం. RGV ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని చెప్పుకున్నాడు’ ఈ సినిమా నిర్మాత రాకేశ్ రెడ్డి.

ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. RGV డిఫెరెంట్ ప్రమోషన్ స్ట్రాటజీ కూడా ఈ సినిమాని మరింత ఫోకస్ లో పెడుతుంది. అయితే ఈ సినిమా కొన్ని రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా, ఎలక్షన్స్ ని టార్గెట్ చేసుకునే తెరకెక్కుతుందనే అపోహలకు చెక్ పెడుతున్నారు మేకర్స్.

‘ఇప్పటికే బాలకృష్ణ గారు ‘కథానాయకుడు’ అని ఒక బయోపిక్ రిలీజ్ చేశారు. ‘మహానాయకుడు’ కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాల్లో ఎలాగైతే కొన్ని ముఖ్య ఘట్టాలు చేర్చి తెరకెక్కించారో, ‘లక్ష్మీస్ NTR’ లో కూడా అలాంటి ముఖ్యమైన సంఘటనను తెరమీదికి తీసుకురాబోతున్నాం. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను న్యాయపరంగా ఎదురుకుంటాం. సినిమాని తప్పకుండా రిలీజ్ చేస్తాం’. అని చెప్పుకున్నాడు నిర్మాత రాకేశ్ రెడ్డి.

ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో  ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసి, మార్చి లో సినిమాని రిలీజ్ చేసే  ఆలోచనలో ఉన్నారు మేకర్స్.