నో కాంప్రమైజ్....

Saturday,December 03,2016 - 05:00 by Z_CLU

వర్మ రూటే సెపరేటు అని కొత్తగా చెప్పనక్కర్లేదు. సంచలనాత్మక సినిమాలు తెరకెక్కించడం వాటితో సంచలనానికి తెరతీయడం వర్మకు కొత్తేమి కాదు. తాజాగా వర్మ తెరకెక్కించిన ‘వంగవీటి’ చిత్రం  సంచలనానికి కేరాఫ్ అడ్రెస్ గా మారింది.

విజయవాడ గురించి అమితంగా తెలియడంతో వర్మ ఆ నేపధ్యంలో ఓ సినిమాను తెరకెక్కించాడు అదే ‘ వంగవీటి’ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా ఆడియో విడుదల మరికాసేపట్లో విజయవాడ లో నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ఉదయం రంగా కుమారుడు రాధా, రత్న కుమారితో భేటీ అయ్యా డు ఆర్జీవీ . అయితే ఈ మీటింగ్ సజావుగా సాగలేదని చాలా వార్నింగ్స్ వస్తున్నాయని కానీ వాటికి ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని, ఈ సినిమా విషయం లో కాంప్రమైజ్ కాబోనని  తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు వర్మ. మరి ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్ తో కాంట్రవర్సీ సృష్టించిన వర్మ ట్రైలర్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో? చూడాలి.

varma-capture

rgv-tweet