రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ

Monday,November 26,2018 - 01:57 by Z_CLU

సిద్ధార్థ తాతోలు డైరెక్షన్ లో తెరకెక్కింది భైరవగీత. ఈ నెల 30 న రిలీజవుతున్న ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పుకున్నాడు RGV. అవి మీకోసం…

 అదీ సినిమాటిక్ లాంగ్వేజ్

కొన్ని సినిమాలు కథ వల్ల ఆడతాయి. మరికొన్ని సినిమాలు స్టార్ డమ్ వల్ల ఆడతాయి. నాకు సిద్ధార్థ ఎప్పుడైతే ఈ సినిమాలోని కొన్ని  సీన్స్ ఎక్స్ ప్లేన్ చేశాడో, అపుడే సినిమా ఆడేస్తుందనిపించింది. అదీ సినిమాటిక్ లాంగ్వేజ్.

అది జనాలకే తెలుసు…

మేము ఎంచుకున్న కథ జనాలకు ఎంత వరకు రీచ్ అవుతుంది..? ఏ రేంజ్ లో నచ్చుతుందనేది ఎవరూ అంచనా వేయలేరు కానీ, ఒక ఫిల్మ్  మేకర్ గా ఇది అద్భుతమైన కథ అని నాకనిపించింది.

అందుకే కొత్త వాళ్ళు..

ఒక రియలిస్టిక్ స్పేస్ లో ఒక కథను చెప్పాలి అనుకున్నప్పుడు, ఏ ఇమేజ్ లేని యాక్టర్స్ అయితేనే ఎవరైనా కనెక్ట్ అవ్వగలుగుతారు అనేది నా ఫీలింగ్. అందుకే ఈ సినిమాలో కొత్త వాళ్ళను ప్రిఫర్ చేయడం జరిగింది.

స్పెషల్ గా సిద్ధార్థ…

సిద్ధార్థ సినిమాటిక్ లాంగ్వేజ్ వేరు… నేనిప్పటి వరకు నేను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ వేరు.. సిద్ధార్థ వేరు. ఇక్కడ సిద్ధార్థ సినిమాలోని పర్టికులర్ సీన్స్ చెప్పిన విధానం చాలా స్పెషల్ గా ఉంటుంది.

నా స్టైల్ ఆఫ్ మేకింగ్..

ట్రైలర్ చూసినప్పుడు జస్ట్ షాట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి, నా స్టైల్ ఆఫ్ మేకింగ్ అనిపించినా, సినిమా చూసినప్పుడు మీకు డిఫెరెన్స్ ఏంటనేది తెలుస్తుంది.

కథ పాతదే కానీ…

కులాలు, మతాల బ్యాక్ డ్రాప్ లో ఉండే ఏ రెబల్ స్టోరీ అయినా ఒక పర్టికులర్ రీజన్ తో బిగిన్ అవుతుంది. ఆ రీజన్స్ ఏవైనా కావచ్చు. ఈ భైరవగీత లో మాత్రం ‘లవ్’ ఎలిమెంట్ తో బిగిన్ అవుతుంది. ఒక తక్కువ స్థాయి అబ్బాయి, పై స్థాయి అమ్మాయిని ప్రేమించడం మూలాన, వచ్చే ఇబ్బందులతో.. ఒక తిరుగుబాటు లాంటిది జరగడమే ‘భైరవగీత’.

సిద్ధార్థ నా ఆలోచనలకు మించి…

పేపర్ లో ఒక సీన్ చదివి ఒక సగటు ఫిల్మ్ మేకర్ గా ఈ సీన్ ఇలా ఉండబోతుంది అనుకుంటాను. కానీ సిద్ధార్థ మైండ్ లో ఇంకో విజన్ నడుస్తూ ఉంటుంది. అతని ఆలోచనలు నా ఆలోచనలకు మించి ఉంటాయి.

లక్ష్మీస్ NTR…

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న NTR బయోపిక్ లో NTR గారి స్టార్ డమ్, ఆయన సక్సెస్ ఫుల్ పొలిటికల్ కరియర్ హైలెట్ అవుతుంది. అది చూసిన అభిమానులకు డెఫ్ఫినేట్ గా అది ఫీస్ట్ లాంటిదే.. అయితే నేను తీస్తున్న బయోపిక్ లో ఆయన లాస్ట్ డేస్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఉండబోతున్నాయి. డార్క్ సైడ్ ఆఫ్ NTR లైఫ్, నా సినిమాలో హైలెట్ అవుతుంది.

నెక్స్ట్ ఇయర్ రిలీజ్…

లక్ష్మీస్ NTR మ్యాగ్జిమం జనవరి సెకండాఫ్, లేదా ఫిబ్రవరి ఫస్టాఫ్ లో రిలీజయ్యే చాన్సెస్ ఉన్నాయి. షూటింగ్ ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉంది.

అదే సినిమా…

లక్ష్మీ పార్వతి NTR లైఫ్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి NTR గారి చివరి క్షణాల వరకు సినిమా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో  ఎంతమంది   ఈ జర్నీలో ఉన్నారో, ఆ క్యారెక్టర్స్ అన్ని ఈ సినిమాలో ఉంటాయి.

అజయ్ భూపతి తో…

అజయ్ భూపతితో సినిమా ఉంటుంది. ఇద్దరం కలిసి సినిమా నిర్మిద్దామనుకున్నాం.