అవసరాల శ్రీనివాస్

Wednesday,November 30,2016 - 06:35 by Z_CLU

అవసరాల శ్రీనివాస్ ప్రముఖ నటుడు,రచయిత, దర్శకుడు. మార్చ్ 19,1984 లో జన్మించారు. మొదట ‘బ్లైండ్ ఆంబిషన్’ సినిమాకు దర్శకత్వ శాఖ లో పనిచేసారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ‘అష్టా-చమ్మా’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తరువాత ‘ఆరెంజ్’, ‘సరదాగా కాసేపు’,’ముగ్గురు’,’పిల్ల జమిందార్’,’చందమామ లో అమృతం’,’అడ్డా’,’అంతకు ముందు ఆ తరువాత’,అరవింద్-2′, ‘సుకుమారుడు’,’గోవిందు అందరి వాడేలే’ సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. ‘ఊహలు గుస గుస లాడే’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం లో నటుడిగా ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రం తరువాత ‘జిల్’,’ఎవడె సుబ్రహ్మణ్యం’,’బంది పోటు’,’కంచె’,’నాన్నకు ప్రేమతో’,’రాజా చేయి వేస్తే’,’అ ఆ’ జెంటిల్ మన్’,’ఒక మనసు’ సినిమాల్లో నటుడిగా నటించారు. నారా రోహిత్, నాగ శౌర్య కథానాయకులుగా తెరకెక్కిన ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో మరో సారి దర్శకుడిగా మారారు. ఈ చిత్రం తో మరో సారి దర్శకుడిగా విజయం అందుకున్నారు.

సంబంధిత వార్తలు