యూ టర్న్ తీసుకున్న దర్శకుడు

Monday,March 13,2017 - 02:33 by Z_CLU

‘ఊహలు గుస గుస లాడే’ సినిమాతో మెగా ఫోన్ పట్టిన అవసరాల శ్రీనివాస్ లేటెస్ట్ గా నారా రోహిత్-నాగ శౌర్య’ లతో ‘జ్యో అచ్యుతానంద’ అనే సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడిగా బిజీ అవుతున్నాడనుకున్న అందరికీ షాక్ ఇచ్చాడు అవసరాల..

నాని తో పాటు మరికొందరు యంగ్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేసుకున్న ఈ దర్శకుడు దర్శకుడిగా కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ నటుడిగా యూ టర్న్ తీసుకొని ఎంటర్టైన్ చేయాలనీ చూస్తున్నాడు.. మొన్నటి వరకూ కేవలం స్పెషల్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసిన అవసరాల ప్రస్తుతం హీరో గా ఓ రెండు సినిమాలతో బిజీ అయిపోయాడు…

‘బాబు బాగా బిజీ’ అనే సినిమాతో పాటు అడివిశేష్ తో కలిసి ‘అమీ తుమీ’ సినిమాలో మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు.. లేటెస్ట్ గా ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సోషల్ మీడియా హంగామా చేస్తున్నాయి.. మరి హీరోగా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న అవసరాల ఈ రెండు సినిమాల తర్వాతైనా మళ్ళీ మెగా ఫోన్ పడతాడో..లేదా నటుడిగా బిజీ అయిపోతాడో..చూడాలి..