ఒక్కక్షణం డైరెక్టర్ V.I. ఆనంద్ ఇంటర్వ్యూ

Tuesday,December 26,2017 - 01:30 by Z_CLU

V.I. ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కింది ‘ఒక్కక్షణం’ మూవీ. అల్లు శిరీష్, సురభి జంటగా నటించిన ఈ సినిమాలో  అవసరాల శ్రీనివాస్ కీ రోల్ ప్లే చేశాడు. ‘ప్యారలల్ లైఫ్’ అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ V.I. ఆనంద్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

 

సినిమా కాన్సెప్ట్ అదే…

లవ్ కి డెస్టిని కి మధ్య కాన్ఫ్లిక్టే ‘ఒక్కక్షణం’ సినిమా. ప్రేమ విషయంలో ఏదీ మన కంట్రోల్ లో ఉండదు. జరిగిపోతుందంతే. అలాగే డెస్టిని కూడా ఆల్ రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. అయితే ఈ రెండింటికి మధ్య కాంఫ్లిక్ట్ క్రియేట్ అయినప్పడు ప్రేమ గెలిచిందా, డెస్టినీ గెలిచిందా అనేదే సినిమా…

 

 

ఫిక్షన్ కాదు కాన్సెప్ట్…

లైఫ్ ని పోలిన లైఫ్ అనేది ఫిక్షన్ కాదు, కాన్సెప్ట్.  ఆత్మలు, పునర్జన్మ, స్ప్లిట్ పర్సనాలిటీ లాగే లైఫ్ ని పోలిన లైఫ్ అనేది ఒక కాన్సెప్ట్. కొత్తగా నేను క్రియేట్ చేసిన ఫిక్షన్ కాదు. ఈ విషయంలో 1850 నుండే పరిశోధనలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి చాలా ఆర్టికల్స్, బుక్స్ ఉన్నాయ్.

 

అందుకే రివీల్ చేశాం…

చాలా మంది టీజర్ లో ప్యారలల్ లైఫ్ గురించి రివీల్ చేయకపోతేనే బెటర్ అని సజెస్ట్ చేశారు. కానీ రివీల్ చేయకపోతే ఎక్స్ పెక్టేషన్స్ కి సినిమా కాన్సెప్ట్ మ్యాచ్ అవ్వవు, అందుకే ఆడియన్స్ ని ముందుగా ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతోనే సినిమా కాన్సెప్ట్ ని ముందే రివీల్ చేసేశాం…

 

రియల్ లైఫ్ లోను ఉంటాయి…

రియల్ లైఫ్ లో కూడా ప్యారలల్ లైఫ్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు మనకు ఎదురు పడేంత వరకు వాళ్ళ లైఫ్  మన లైఫ్ ఒకేలా ఉందనే విషయం మనకు తెలీదు…

 

కాంప్లికేటెడ్ గా ఉండదు…

సినిమా చాలా సింపుల్ గా ఉంటుంది. హెవీ కాంప్లికేటెడ్ సీన్స్ ఉండవు. బ్రెయిన్ కి పని చెప్పాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా అవసరాల శ్రీనివాస్, అల్లు శిరీష్ కాంబినేషన్ లో ఉండే సీన్స్  చాలా  ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.

 

వినగానే ఓకె అనేశారు…

అల్లు శిరీష్ గారు స్టోరీ వినీ వినగానే ఓకె అనేశారు… ఏది ఏమైనా ఈ సినిమా చేస్తున్నాం అన్నారు.. అలాగే సినిమా సెట్స్ పైకి వచ్చేసింది…

 

అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా….

సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. లవ్, రొమాన్స్, యాక్షన్, థ్రిల్… ఎక్కడా బోర్ కొట్టదు.

 

 

టాలీవుడ్ చాలా బావుంది….

ప్రతి సినిమా బైలింగ్వల్ లో చేయలేం.. నేటివిటీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రస్తుతానికి టాలీవుడ్ చాలా బావుందనిపిస్తుంది. ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాను…

 

టాలీవుడ్ కి రావడం డెస్టినీ…

సినిమాలో పని చేయాలనుకున్నా… అందుకు మంచి డైరెక్టర్ దగ్గర పనిచేయాలనుకుని A.R. మురుగదాస్ దగ్గర జాయిన్ అయ్యా… ఆయన అప్పుడు తెలుగులో స్టాలిన్ సినిమా చేస్తున్నారు, అలా టాలీవుడ్ కి దగ్గరయ్యాను. ఆ తరవాత ఒక సినిమాకి స్టోరి కావాలని అడిగారు… ఇచ్చాను, ఆ తరవాత సడెన్ గా కాల్ చేసి, ఈ సినిమా మీరే చేయాలి అన్నారు… ఆ తరవాత టైగర్ సినిమా… అలా ఎటు తిరిగినా డెస్టినీ నన్ను టాలీవుడ్ కి దగ్గర చేసింది…

 

లీడ్ రోల్స్ కాకుండా…

హీరో మదర్ & ఫాదర్ గా కాశీ విశ్వనాథ్ గారు, రోహిణి నటించారు. వీళ్ళతో పాటు ప్రవీణ్ , సత్య, జయ ప్రకాష్ గారు.. విలన్ రోల్ ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుంది.

 

చాలా రీసర్చ్ చేశాను…

ప్యారలల్ లైఫ్ ఉంటుందని జస్ట్ చెప్పడం కాదు, ఈ సినిమాలో చాలా వరకు ఫ్యాక్ట్స్ డిస్కస్ చేశాం. నేను చేసిన రీసర్చ్ ప్రాసెస్ లో చాలా విషయాలు తెలిశాయి. అందులో ఏది చెప్తే అర్థమవుతుందో అవే సినిమాలో చెప్పాం…

 

అలాంటి   సినిమాలే   చేస్తా…

ఇంకా చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఫిక్షన్, యాక్షన్, రొమాన్స్. ఈ సినిమా రిలీజ్ తరవాత వాటిపై ఫోకస్ పెడతాను… ఈ సినిమా తరవాత కూడా మళ్ళీ ఇలాగే స్ట్రాంగ్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమానే చేస్తాను… కాన్సెప్ట్, కంటెంట్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యాలన్స్డ్ గా ఉండే సినిమాలే చేస్తా…