'అమీ తుమీ' టీజర్ రిలీజ్ చేసిన నాని

Monday,April 17,2017 - 07:15 by Z_CLU

అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ “అమీ తుమీ”. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు నేచురల్ స్టార్ నాని…

వెన్నెల కిశోర్- అడివి శేష్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ తో ఉన్న ఈ టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియా లో హంగామా చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది… హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్…