అమీతుమీ సెన్సార్ క్లియరెన్స్

Thursday,May 25,2017 - 11:52 by Z_CLU

కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న అమీతుమీ సెన్సార్ క్లియర్ అయింది. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా, ట్రేలర్ రిలీజయినప్పటి నుండే స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసుకుంది. జూన్ 9 న థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్న ఈ సినిమా U సర్టిఫికెట్ పొందింది.

మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అదితి మ్యాకల్, ఈషా హీరోయిన్స్  గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమాకి K.C. నరసింహారావు ప్రొడ్యూసర్.