‘మిసెస్ సుబ్బలక్ష్మి’గా మంచు లక్ష్మీ ప్రసన్న

Tuesday,March 05,2019 - 04:23 by Z_CLU

సినిమా, టెలివిజన్ ఇప్పుడు డిజిటల్… మంచు లక్ష్మీప్రసన్న గ్రాండ్ గా డిజిటల్ డెబ్యూ ఇవ్వనుంది. ఇప్పటి వరకు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు టి.వి. ప్రోగ్రామ్స్ ని హోస్ట్ చేసిన మంచు లక్ష్మీ ప్రసన్న ‘మిసెస్ సుబ్బలక్ష్మీ’ గా కనిపించనుంది.

ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8 న ZEE5 యాప్ లో రిలీజవుతుంది ఈ ‘మిసెస్ సుబ్బలక్ష్మి’.  ఈ వెబ్ సిరీస్ లో శ్రీనివాస్ అవసరాల, మంచు లక్ష్మీ ప్రసన్న జంటగా నటించారు. భర్త తనతో సరిగ్గా సమయం గడపకపోవడంతో, అలాగే కుమిలిపోతూ బ్రతకడం ఇష్టం లేక తనతో తానే ఒక స్వేచ్ఛాయుతమైన జీవితం గడిపేద్దామనుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే యంగ్ వైఫ్ లా కనిపించనుందీ మంచు లక్ష్మీ ఈ వెబ్ సిరీస్ లో.

ఎప్పుడు చూసినా ఆఫీస్ పనులతో బిజీగా ఉండే సుబ్బు రోల్ లో, భార్య తనను వదిలేసి జస్ట్ ఒకరోజు అలా వెళ్ళిపోయిందో లేదో, తెగ ఇబ్బంది పడిపోయే భర్తలా హిలేరియస్ రోల్ ప్లే చేశాడు శ్రీనివాస్ అవసరాల. ఇంతకీ భర్తను వదిలేసి వెళ్ళిపోయిన మిసెస్ సుబ్బలక్ష్మీ ఏం తెలుసుకుంది..? బయటికి వెళ్ళీ వెళ్ళగానే తను ఫేస్ చేసిన సమస్యలేంటి..? వాటి నుండి బయటపడటానికి ఏం చేసింది..? అనేదే ఈ వెబ్ సిరీస్ ప్రధాన కథాంశం.

వంశీ ఈ వెబ్ సిరీస్ కి దర్శకుడు. ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో, మోస్ట్ యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా వేణు టిల్లు, మహేష్ విట్ట, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావ్, చిత్రం శ్రీను ఇతర కీలక పాత్రలు పోషించారు.