'మే' సినిమా సందడి ...

Sunday,April 30,2017 - 01:30 by Z_CLU

ప్రెజెంట్ సమ్మర్ సెన్సేషనల్ హిట్ గా నిలిచి థియేటర్స్ లో ‘బాహుబలి-2’  భారీ సందడి చేస్తుంటే మరో వైపు మే నెలలో మరికొన్ని సినిమాలు టాలీవుడ్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి..

‘బాహుబలి 2’ రిలీజ్ తర్వాత ఓ రెండు వారాల పాటు ఏ సినిమా రాదనే న్యూస్ ని బ్రేక్ చేసింది ‘బాబు బాగా బిజీ’.. మే నెలలో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇదే.. అవసరాల శ్రీనివాస్-మిస్తీ చక్రవర్తి -తేజస్వి మడివాడ -శ్రీముఖి – సుప్రియ లతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మే 5 నుంచి థియేటర్స్ లో సందడి చేయనుంది.


ఇక బాబు బాగా బిజీ తో పాటు మే 5 న రిలీజ్ కి రెడీ అవుతుంది ‘వెంకటాపురం’.. హ్యాపీడేస్ ఫేం రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు డైరెక్షన్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సందడి చేయబోతుంది..


ఇక ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తరువాత నిఖిల్ నటించి ‘కేశవ’ కూడా మేలో రిలీజ్ కి రెడీ అవుతుంది.సుధీర్ వర్మ డైరెక్షన్ లో రివెంజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా మే 19 నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతుంది..

సమ్మర్ స్పెషల్ గా నాగ చైతన్య కూడా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అంటూ ఓ ఫామిలీ ఎంటర్టైనర్ తో మే  లో హంగామా చేయబోతున్నాడు.. సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా సమ్మర్ లో కూల్ ఎంటర్టైనర్ గా సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది. మే 19న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది

నాగ అన్వేష్-హెబ్బా పటేల్ జంటగా రాజమౌళి శిష్యుడు పాలని దర్శకత్వం లో సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మిస్తున్న ‘ఏంజెల్’ సినిమా కూడా మే లో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది.. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 19 న థియేటర్స్ లో అడుగుపెట్టనుంది..

రాజ్ తరుణ్ కూడా మే లో ఓ అంధుడు క్యారెక్టర్ తో ‘అంధగాడు’ గా ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. హెబ్బా పటేల్ హీరోయిన్ గా రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం లో ఏ.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మే 26 న రిలీజ్ కానుంది..

సమ్మర్ కి ‘ఉంగరాల రాంబాబు’ సినిమాతో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాడు సునీల్.. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఫుల్లెన్గ్థ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా మే చివరి వారం లో థియేటర్స్ లోకి రాబోతుంది..