"అ!" సినిమా సెన్సార్ పూర్తి.. ఫిబ్రవరి 16న రిలీజ్

Friday,February 09,2018 - 05:43 by Z_CLU

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తీసిన సినిమా “అ!”. ప్రశాంత్ వర్మ అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. మూవీకి సెన్సార్ కంప్లీట్ అవ్వడంతో.. సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించారు. ఫిబ్రవరి 16న థియేటర్లలోకి రాబోతున్నట్టు నాని ఎనౌన్స్ చేశాడు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది “అ!” సినిమా. మేకర్స్ చెబుతున్నదాని ప్రకారం తెలుగుతెరపై ఇలాంటి స్టోరీలైన్ రాలేదంట. ఇంత స్పెషల్ మూవీ కాబట్టే తను ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నాడట నాని. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ తో పాటు నిత్యామీనన్, రెజీనా, ఈషా లాంటి హీరోయిన్లు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. వీళ్లతో పాటు అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమా కథ ఏంటనేది ప్రస్తుతానికి బయటకు రాకపోయినా.. రెండు ఎలిమెంట్స్ మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సినిమాలో ఓ చేపలా కనిపించబోతున్నాడు నాని. చేపకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.ఇక స్టార్ హీరో రవితేజ, ఓ చెట్టులా కనిపించబోతున్నాడు. రవితేజ వాయిస్ తో చెట్టు మాట్లాడుతుందన్నమాట.