వైశాఖ్

Friday,December 02,2016 - 03:10 by Z_CLU

వైశాఖ్ ప్రముఖ మలయాళ దర్శకుడు. మొదట ‘కోచి రాజవు’ చిత్రానికి దర్శకత్వ శాఖ లో పనిచేశారు. తరువాత ‘తురుప్పుగులం’,’ట్వంటీ’,’ రాబిన్ హుడ్’ అనే సినిమాలకు దర్శకత్వ శాఖ లో పనిచేశారు. మమ్ముట్టి, పృద్వి రాజ్ కథానాయకులుగా తెరకెక్కిన ‘పొక్కిరి రాజా’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి దర్శకుడిగా వైశాఖ్ కు మంచి గుర్తింపు అందించింది. ఈ సినిమా తరువాత ‘సీనియర్స్’,’మల్లు సింగ్’,’సౌండ్ తోమా’,’విశుధన్’,’కజిన్స్’ వంటి సినిమాలను తెరకెక్కించారు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘పులి మురుగన్’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం మలయాళం లో దాదాపు 100 కోట్లు సాధించింది.

సంబంధించిన చిత్రం