జస్ట్ 31 రోజుల్లో షూటింగ్ కంప్లీట్

Thursday,April 06,2017 - 12:35 by Z_CLU

మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘అమీతుమీ’ షూటింగ్ కంప్లీట్ అయింది. అడివి శేషు, శ్రీనివాస్ అవసరాల, ఈషా, అదితి మ్యాకల్ నటిస్తున్న ఈ సినిమాని జస్ట్ 31 రోజుల్లోనే ప్యాకప్ చెప్పేసింది సినిమా యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని జస్ట్ 13 డేస్ లో పూర్తి చేస్తామని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

నిజానికి జెంటిల్ మెన్ లాంటి సూపర్ హిట్ సినిమా తరవాత మోహన కృష్ణ  డైరెక్టోరియల్ నాగ చైతన్య సినిమా రావాల్సింది, కారణాలు ఏవైనా ఆ సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ కామిక్ ఎంటర్ టైనర్ ని పిక్ చేసుకున్నాడు మోహన కృష్ణ ఇంద్రగంటి.

వెన్నెల కోశోర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. K.C. నరసింహా రావు ఈ సినిమాకి ప్రొడ్యూసర్.