త్రివిక్రమ్ – కీ రోల్స్ లో యంగ్ హీరోలు

Tuesday,October 22,2019 - 10:04 by Z_CLU

గ్రాండ్ గా ప్రెజెంట్ చేసి అప్పటివరకు కనీసం గుర్తు కూడా లేని సీనియర్ హీరోయిన్స్ ని ఫామ్ లోకి తీసుకు వస్తాడు త్రివిక్రమ్. ఒక్క వాళ్ళ విషయంలోనే కాదు యంగ్ ‘హీరో’స్ కి కూడా అలాంటి క్యారెక్టర్స్ నే రాసుకుంటాడు. అప్పటికే హీరోలుగా సినిమాలు చేసిన వాళ్లకి తన కథల్లో ప్రత్యేకంగా క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకుంటాడు. దీంతో ఆ హీరోల గ్రేస్ ఆడియెన్స్ కి మళ్ళీ గుర్తుకు రావడమే కాదు, ఆ పర్టికులర్ సినిమా హీరో రేంజ్ కూడా ఇంకో మెట్టు పైకి ఎక్కేస్తుంది. గత కొన్ని సినిమాలుగా ఈ ఆనవాయితీని తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాడు త్రివిక్రమ్.

అల వైకుంఠపురంలో– ఈ సినిమా అల్లు అర్జున్ ది. అయితే ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు కీ రోల్స్ లో నటిస్తున్నారు. నవదీప్, సుశాంత్. నవదీప్ గతంలో కొన్ని సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేశాడు కానీ, సుశాంత్ మాత్రం తన కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఇలా కీ రోల్ లో కనిపించబోతున్నాడు. మరి సినిమాలో ఈ ఇద్దరు హీరోలకి ‘అల’ అసలు హీరో అల్లు అర్జున్ కి మధ్య కనెక్షన్ ఏంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

అరవింద సమేత – ఈ సినిమాలో నవీన్ చంద్ర ప్లే చేసిన ‘బాల్ రెడ్డి’ ని ఇప్పట్లో మర్చిపోవడం అస్సలు పాసిబుల్ కాదు. అంత అద్భుతంగా రాసుకున్నాడు త్రివిక్రమ్. ఓ రకంగా చెప్పాలంటే నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమాలన్నీ ఒకెత్తు. ఈ సినిమా ఒకెత్తు. ఈ క్యారెక్టర్ కి ఇంకెవర్ని ఎంచుకున్నా ఇంతలా వర్కవుట్ అయ్యేది కాదేమో..

అజ్ఞాతవాసి – ఆది పినిశెట్టికి కీ రోల్స్ ప్లే చేయడం కొత్త కాదు. కానీ చేసిన ప్రతి క్యారెక్టర్ కి ప్రాణం పోస్తాడు అన్నంత డెడికేటెడ్ గా నటించాడు సీతారామ్ క్యారెక్టర్ లో.

అ ఆ : ‘శేఖర్ బెనర్జీ’… శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాలో ప్లే చేసిన క్యారెక్టర్. సినిమా మొత్తంలో న్యాచురల్ గా మూవ్ అయ్యే క్యారెక్టర్ మధ్య ఈ క్యారెక్టర్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.