అవసరాలతో నాని రెడీ

Sunday,February 04,2018 - 10:07 by Z_CLU

ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్నాడు నాని. ఆల్మోస్ట్ ఈ సినిమాను ఫినిషింగ్ స్టేజికి తీసుకోచ్చేసిన నేచురల్ స్టార్ త్వరలోనే అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమాను చేయబోతున్నాడు. ఆ మధ్య కొన్ని ఇంటర్వూల్లో అవసరాల డైరెక్షన్ లో కచ్చితంగా సినిమా చేస్తానని చెప్పుకొచ్చిన నాని ఎట్టకేలకి ఆ సినిమాకు శ్రీకారాం చుట్టబోతున్నాడట. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందని, మార్చ్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

ఇప్పటికే దర్శకుడిగా రెండు సూపర్ హిట్స్ అందుకొన్న అవసరాల ఎట్టకేలకి తన మిత్రుడు నాని తో ఓ సినిమా చేయబోతున్నాడన్నమాట. మరి ఈ సినిమాలో నానిని అవసరాల ఎలా చూపిస్తాడో.. ఎలాంటి కథతో సినిమాను రూపొందిస్తాడో..చూడాలి.