శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో అల్లరి నరేష్

Wednesday,December 11,2019 - 06:54 by Z_CLU

హీరోగా మళ్ళీ బిజీగా అయ్యాడు అల్లరి నరేష్. ఆ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్నాడు అనిపించినా, ఆ తర్వాత మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో కీ రోల్ ప్లే చేసి భేష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఓ వైపు ‘బంగారు బుల్లోడు’ తో బిజీగా ఉంటూనే రీసెంట్ గా ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని అనౌన్స్ చేశాడు. అయితే ఈ గ్యాప్ లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ అల్లరోడు. అది కూడా శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో… 

ప్రస్తుతానికి ఈ సినిమా విషయంలో ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ ఈ సినిమా ఆల్మోస్ట్ కన్ఫమ్ అనే స్థాయిలో సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో నివేత పేతురాజ్ హీరోయిన్ అని తెలుస్తుంది. 

శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా చేసే సినిమాలు డిఫెరెంట్ స్టైల్ లో ఉంటాయి. అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే, న్యాచురల్ గానే ఫోకస్ పెరుగుతుంది. అయితే ఈ టాక్ అఫీషియల్ గా కన్ఫమ్  అవుతుందో… జస్ట్ రూమర్ గా మిగిలిపోతుందో చూడాలి.