నాని ‘అ!’ టీజర్ కొత్తగా ఉంది

Thursday,January 04,2018 - 05:35 by Z_CLU

నాని అ! సినిమా టీజర్ రిలీజయింది. కాజల్, రెజీనా, నిత్యా మీనన్, అవసరాల శ్రీనివాస్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో నాని చేపలా కనిపించనున్నాడు. నాని వాయిస్ లో ఒక చేప కథ చెప్తూ బిగిన్ అయిన టీజర్ రొటీన్ గా కాకుండా కొత్త స్టోరీ చెప్పడం ప్రారంభించడం, ఆ తరవాత ఫాస్ట్ పేజ్ లో క్యూరాసిటీ రేజ్ చేస్తున్న టీజర్ కట్స్ నాని చెప్పినట్టు సినిమా డెఫ్ఫినేట్ గా కొత్తగా ఉండబోతుందన్న ఫీలింగ్ ని కలిగిస్తున్నాయి.

 రెగ్యులర్ సినిమా ఫార్మాట్ లో కాకుండా డిఫెరెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని నిర్మిస్తున్న ‘అ!’ ఫిబ్రవరి 2 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.