మరో సారి ఆ హీరోతో అవసరాల ?

Sunday,January 20,2019 - 04:04 by Z_CLU

దర్శకుడిగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అవసరాల శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన అవసరాల మరో సారి నాగ శౌర్య ని డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇటివలే శౌర్య కి స్క్రిప్ట్ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట శ్రీనివాస్.

ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుందని సమాచారం. ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ రాజు కొలుసు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న శౌర్య మరోవైపు నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత నటిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు కాశి డైరెక్షన్ లో మరో సినిమా సైన్ చేశాడు శౌర్య. ఈ సినిమాతో పాటే అవసరాల సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే చాన్స్ ఉంది.