తెలుగుతెరపైకి మరో క్రేజీ కాంబో

Saturday,March 11,2017 - 01:35 by Z_CLU

నాని-అవసరాల శ్రీనివాస్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. అష్టాచమ్మా సినిమాతో వీళ్లిద్దరూ వెలుగులోకి వచ్చారు. అప్పట్నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మోస్ట్ డిపెండబుల్ హీరోగా నాని కంటిన్యూ అవుతుంటే.. అటు నటుడిగా, మరోవైపు దర్శకుడిగా సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. ఇప్పుడు ఈ స్నేహితులిద్దరూ మరోసారి కలుస్తున్నారు. అవసరాల దర్శకత్వంలో నాని నటించే ప్రాజెక్టు ఓకే అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు త్రివిక్రమ్ రూపంలో మరో స్టార్ యాడ్ అయ్యాడు.

అవును.. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాని చేయబోయే ప్రాజెక్టులో త్రివిక్రమ్ కూడా భాగమయ్యారు. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ రాయడం లేదు. ఏకంగా ఈ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేయబోతున్నారు. నితిన్ సినిమాతో ఇప్పటికే నిర్మాతగా మారిన త్రివిక్రమ్.. నాని కోసం అవసరాల రాసుకున్న కథ విని థ్రిల్ ఫీలయ్యారు. వెంటనే సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకురానున్నాయి.