రేపే 'అమీతుమీ' రిలీజ్

Thursday,June 08,2017 - 03:00 by Z_CLU

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో అల్టిమేట్ యూత్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అమీతుమీ ఈ వీకెండ్ రిలీజ్ కి అన్ని ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకుని రెడీగా ఉంది. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, కామెడీ ఎలిమెంట్స్ తో రేపట్నుంచి థియేటర్లలో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయబోతోంది.

ఇప్పటికే రిలీజైన పాటలు, సినిమాపై పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తే, కామెడీ కంపల్సరీ అని క్లారిటీ ఇచ్చిన ట్రయిలర్, సినిమాపై హిల్లేరియస్ ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచేస్తున్నాయి. జెంటిల్ మెన్ లాంటి ఇంటెలిజెంట్ బ్లాక్ బస్టర్ తరవాత మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా, న్యాచురల్ గానే సినిమా ఫ్యాన్స్ లో క్యూరాసిటీని రేజ్ చేస్తుంది. అదితి మ్యాకల్, ఈషా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని K.C. నరసింహా రావు నిర్మించారు.