అల్లు శిరీష్ మూవీ టైటిల్ ఫిక్స్

Thursday,November 09,2017 - 10:03 by Z_CLU

అల్లు శిరీష్ కొత్త మూవీ టైటిల్ ఫిక్సయింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్  లిస్టులోకి చేరిన V.I. ఆనంద్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాకు ‘ఒక్కక్షణం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్.

 

ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన సురభితో పాటు శీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అల్టిమేట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల కీ రోల్ ప్లే చేస్తున్నాడు. చక్రి చిగురుపాటి ప్రొడ్యూసర్. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.