కథలో రాకుమారి ప్రీ లుక్

Monday,February 13,2017 - 02:03 by Z_CLU

రేపు రిలీజ్ కానున్న నారా రోహిత్ కథలో రాకుమారి ఫస్ట్ లుక్ కి ఈ రోజు ప్రీ ఎలుక్ రిలీజయింది. డిఫెరెంట్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న నారా రోహిత్ మరో డిఫెరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్నాడు. నమితా ప్రమోద్ ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మహేష్ సూరపనేని డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.

డిఫెరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్, సినిమా కూడా అంతే డిఫెరెంట్ గా ఎంటర్ టైన్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇళయరాజా, విశాల్ శేఖర్ జాయింట్ గా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ‘కథలో రాకుమారి’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. నారా రోహిత్ తో పాటు ఈ సినిమాలో నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

 

nara-rohith-kathalo-rakumari-zee-cinemalu

‘Love in it best form’ అనే ట్యాగ్ లైన్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ప్రీ లుక్, వాలెంటైన్ డే సందర్భంగా రేపు రిలీజ్ కానున్న ఫస్ట్ లుక్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ప్రశాంతి, నర్రా సౌందర్య, కృష్ణ విజయ్ నిర్మిస్తున్న ఈ సినిమాని రాజేష్ వర్మ సిరువూరి సమర్పించనున్నాడు.