మరోసారి అమీ తుమీ అంటున్న వెన్నెల కిషోర్

Monday,July 03,2017 - 06:45 by Z_CLU

పేరుకే చిన్న సినిమా. విజయం మాత్రం చాలా పెద్దది. టైటిల్ కు తగ్గట్టు ఇప్పటికీ చాలా సినిమాలకు పోటీగా సై అంటోంది అమీతుమీ. అవసరాల శ్రీనివాస్, అడవి శేషు, వెన్నెల కిషోర్ హీరోలుగా నటించిన ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్ తాజాగా 25 రోజులు పూర్తిచేసుకుంది. నాలుగో వారంలోకి ఎంటరైనప్పటికీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 60 కేంద్రాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది అమీ తుమీ.

ఎప్పుడో బ్రేక్ ఈవెన్ సాధించేసిన ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సునిశిత హాస్యంతో తెరకెక్కిన ఈ సినిమా గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈషా, అదితి మయకల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు.

మూవీకి సంబంధించి ఇప్పటికే సక్సెస్ టూర్స్ కంప్లీట్ చేసింది యూనిట్. కుదిరితే మరోసారి సినిమాకు ప్రచారం కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. డీజే మినహా మరో పెద్ద సినిమా బరిలో లేకపోవడం కూడా అమీ తుమీకి కలిసొచ్చింది.