ఫిబ్రవరి నుండి అవసరాల డైరెక్షన్ లో సినిమా

Monday,December 18,2017 - 07:01 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అవసరాల శ్రీనివాస్. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల సక్సెస్ తరవాత మళ్ళీ డైరెక్షన్ మాట కూడా ఎత్తకుండా నటుడిగానే ఎంటర్టైన్ చేస్తున్న అవసరాల శ్రీనివాస్ ఈ ఫిబ్రవరి నుండి సినిమాలకు బ్రేక్ చెప్పనున్నాడు.

ఫిబ్రవరి నుండి తన డైరెక్షన్ లో 3 వ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్న అవసరాల, ఈ లోపు ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను ఫాస్ట్ గా కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. ఫిబ్రవరిలో బిగిన్ చేసి మ్యాగ్జిమం జూన్, జూలై కల్లా సినిమాను కంప్లీట్ చేయాలని స్కెచ్ వేసుకున్న అవసరాల ఆ తరవాతే యాక్టర్ గా మళ్ళీ సినిమాలు చేస్తాను అని చెప్పాడు.

ప్రస్తుతం నాని నిర్మిస్తున్న ‘అ!’ సినిమాతో పాటు మహానటి సినిమాలో L.V. ప్రసాద్ సినిమాలతో బోజీగా ఉన్న అవసరాల డిసెంబర్ 28 న రిలీజ్ కానున్న అల్లు శిరీష్ ‘ఒక్కక్షణం’ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమాలతో పాటు ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమాకి సంతకం చేసిన అవసరాల ప్రస్తుతం ఈ సినిమాలను ఫాస్ట్ గా కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు.