‘అ!’ సినిమాలో మురళిశర్మ ఫస్ట్ లుక్

Tuesday,December 26,2017 - 07:57 by Z_CLU

వరసగా ‘అ!’ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్న స్టార్స్ ఫస్ట్ లుక్స్ ని రివీల్ చేస్తూ ఇంప్రెస్ చేస్తుంది మూవీ టీమ్. రెజీనా, అవసరాల శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ తరవాత రీసెంట్ గా చేపలా కనిపించనున్న నాని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఈ రోజు మురళిశర్మ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది.

 

డిఫెరెంట్ గా మ్యాజిషియన్ లుక్స్ లో కనిపిస్తున్న మురళిశర్మ ఫస్ట్ లుక్ ని గమనిస్తే నెగెటివ్ రోల్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తనను తాను ఎక్కువగా నమ్మే డిఫెరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు మురళిశర్మ. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ డైరెక్టర్. ఈ సినిమా ఫిబ్రవరి 2 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.