అమీతుమీ ట్రయిలర్ లాంచ్

Monday,May 15,2017 - 06:30 by Z_CLU

టీజర్ తో ఇప్పటికే హల్ చల్ చేసిన అమీ-తుమీ సినిమా త్వరలోనే ట్రయిలర్ తో ఎట్రాక్ట్ చేయబోతోంది. అడవి శేషు, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా నటించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ ను ఎల్లుండి (మే 17) రిలీజ్ చేయబోతున్నారు. వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

అమీ తుమీ సినిమౌకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు జెంటిల్ మేన్ లాంటి హిట్ తర్వాత ఇంద్రగంటి డైరక్ట్ చేసిన కామెడీ సినిమా ఇది. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇషా, అదితి మియాకల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అమీతుమీ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. త్వరలోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టి, జూన్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.