సక్సెస్ ఫుల్ కాంబో... మరో సారి !

Sunday,March 03,2019 - 09:50 by Z_CLU

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న అవసరాల శ్రీనివాస్ -నాగ శౌర్య మరో సినిమా చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకి రెడీ అవుతున్నారు. నాగ శౌర్యతో గతంలో ‘కళ్యాణ వైభోగమే’ సినిమా చేసిన మాళవిక నైయర్ ఇందులో హీరోయిన్ గా నటించనుంది. వీరిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్ అందుకే మళ్ళీ ఇదే కాంబోను రిపీట్ చేస్తున్నాడు అవసరాల.

ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్. అయితే ఈ సినిమా ‘ఊహల గుసగుసలాడే’ టైపులో మరో కూల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రాబోతోందా.. లేక అవసరాల -శౌర్య మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకున్నారా..అనే డిస్కర్షన్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీ రైజ్ చేస్తుంది. ఇప్పటికే రెండు హిట్స్ అందుకున్న ఈ ఇద్దరు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారా..?లేదా  చూడాలి.

పీపుల్ మీడియా, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్.