నెక్స్ట్ నువ్వే ఆడియోకి మంచి రెస్పాన్స్

Monday,October 09,2017 - 01:06 by Z_CLU

ఆది హీరోగా నటించిన కామెడీ థ్రిల్లర్ ‘నెక్స్ట్ నువ్వే’ ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఆడియోకి సోషల్ మీడియాలో సూపర్ హిట్ టాక్ ని జెనెరేట్ చేస్తుంది. రేగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా డిఫెరెంట్ సినిమా అనిపిస్తున్న ట్రేలర్ తరవాత రిలీజైన ఈ సాంగ్స్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తున్నాయి.

P. ప్రభాకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ ఆల్బంలోని ‘అలా మేడ మీద’ అనే పాటకు కృష్ణ కాంత్ సాహిత్యం అందించగా  ‘అరేయ్ లైఫ్ అంటే’ పాటకు ఎం. సాగర్ నారాయణ  సాహిత్యం అందించాడు.  అవసరాల శ్రీనివాస్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా నవంబర్ 3 న రిలీజ్ కానుంది.  బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమా V4 మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతుంది.