మరో మల్టీస్టారర్ బిగిన్ అయింది

Wednesday,February 01,2017 - 04:48 by Z_CLU

జెంటిల్ మెన్ లాంటి జక్కాస్ బ్లాక్ బస్టర్ తరవాత మరో ఇంటరెస్టింగ్ కామెడీ ఎంటర్ టైనర్ తో సెట్స్ పైకి వచ్చేశాడు  మోహన కృష్ణ ఇంద్రగంటి. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.

మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో ఈష, అదితి మ్యానికల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ రోజే పూజా కార్యక్రమాలతో పాటు సెట్స్ పైకి వచ్చేసింది.

జెంటిల్ మెన్ లాంటి అల్టిమేట్ థ్రిల్లర్ తరవాత ఒక్కసారిగా జోనర్ మారిన ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాని గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై K.C. నరసింహా రావు నిర్మిస్తున్నారు.